రాబియాబి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దివంగత ఆర్.అల్లాబక్ష్
దంపతులకు 1960లో జన్మించిన మహబూబ్ బాష తొలుత రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా
చేరారు. 1984 నవంబర్ నెలలో ఆ ఉద్యోగాన్ని వదలి వేసి ప్రఖ్యాత తెలుగు ప్రధాన
సంపాదకులు గజ్జెల మల్లారెడ్డి సహకారంతో ఆంధ్రభూమి దిన పత్రికలో ట్రెయినీ
రిపోర్టర్/ సబ్ ఎడిటర్‌గా హైదరాబాద్ జర్నలిస్టు వృత్తిని ప్రారంభించారు. ఆ
తరువాత ఆంధ్రపత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి దినపత్రికల్లో 36 ఏళ్ల
పాటు వివిధ స్థాయిల్లో పని చేశారు.
ఆయన తన జర్నలిస్టు జీవితమంతా క్షేత్రస్థాయిలో వివిధ రంగాల, అంశాల
రిపోర్టింగ్కే ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎందరో ప్రముఖులతో ఆయనకు
పరిచయాలయ్యాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు,
అదిలాబాద్, విజయవాడ కేంద్రాల్లో పని చేసి అనుభవం గడించారు. 2008లో సాక్షి
ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సహకారంతో సాక్షి దినపత్రికలో
ప్రవేశించి 13 ఏళ్లకు పైగా రిటైర్మెంట్ (డిసెంబర్ 2020) వరకూ అందులోనే పని
చేశారు. స్టేట్ బ్యూరోలో ప్రధాన విలేకరిగా టీడీపీ, కాంగ్రెస్ బీట్లతో
పాటుగా విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం, ఇరిగేషన్ రంగాల వార్తలను విస్తృతంగా
సేకరించి రిపోర్టు చేశారు. విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాల వార్తలను
జనసామాన్యానికి అర్థం అయ్యేలా రాయడంతో ఆయనది ప్రత్యేకమైన శైలి. రాజకీయ వాదులతో
నిత్య పరిచయాలు గలిగిన బాషా పొలిటికల్ రిపోర్టింగ్ పై చివరి వరకూ ఆసక్తి,
అనురక్తిని కొనసాగించారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ
కేంద్రానికి సంబంధించిన వార్తలను ఆ జిల్లాలో పని చేస్తున్నపుడు విరివిగా కవర్
చేశారు.
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నక్కలదిన్నె పంచాయితీ సమితి అప్పర్
ప్రైమరీ స్కూలు, శ్రీ కశెట్టి చిన్న వెంకటసుబ్బయ్య ఉన్నత పాఠశాలల్లో పాఠశాల
విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత ప్రొద్దుటూరులోని ఎస్వీయూకు అనుబంధంగా ఉండిన
ఎస్సిఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి బి.ఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్
సైన్స్) డిగ్రీని 1982లో పొందారు.
లౌకిక వాద భావాలు గల బాషా తన జర్నలిస్టు జీవితంలో ఆయా ప్రాంతాల వెనుకబాటు
తనాన్ని పరిశీలించి వాటి అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచనలు
రేకెత్తించే కథనాలను అనేకం రాశారు. పలువురు రాష్ట్ర, జాతీయ రాజకీయ నాయకులతో
సత్సంబంధాలు గలిగిన బాషా జర్నలిజంలో నిబద్ధతో పని చేసి అందరి మన్ననలను
చూరగొన్నారు. ప్రస్తుతం సమాచార హక్కు కమిషన్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు
చేపడుతున్నారు .