పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
గుంటూరు : వ్యర్థ పదార్థాలు నదీ జలాల్లో కలవకుండా చూడాలని రాష్ట్ర పురపాలక
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యం నెరవేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని ఆయన
అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం పై హైదరాబాదు నుంచి మంత్రి
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం అమలులో నేషనల్
గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ఎస్టిపి పనులు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆగస్టు 23 నాటికి పూర్తి చేయాలని
ఆదేశించారు. ఎస్టీపి ప్లాంట్ల నిర్మాణం కోసం అవసరమైన స్థల సేకరణకు అన్ని
పురపాలక సంఘాల కమిషనర్లు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా
స్థలాలు సేకరించాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి
తీసుకురావాలని కోరారు. ఈ-ఆటో లు, క్లాప్ వాహనాలను సమాకుర్చుకునేందుకు అవసరమైన
చర్యలు త్వరగా పూర్తి చేయాలన్నారు. తద్వారా ఆదర్శ నగరాలు తయారు చేసేందుకు
దోహదపడుతుందన్నారు. డంపింగ్ యార్డులు ఏర్పాటు కూడా ఎక్కడ పెండింగ్ లేకుండా
చూడాలన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘంలో స్వచ్ఛ సంకల్పం అమలులో
భాగంగా అవసరమైన ఈ-ఆటోలు, క్లాప్ వాహనాలు మంజూరు జరిగేలా చూడాలని అధికారులకు
సూచించారు. ఈ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర ఎండి సంపత్ కుమార్ ఇతర అధికారులు
పాల్గొన్నారు.