గుంటూరు : గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన జరిగిన
55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో పాల్గొని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగించారు. ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు
కేఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
ప్రసంగిస్తూ విద్యార్థులలో ప్రశ్నించే లక్షణం పెరగాలని, జ్ఞాన సము పార్జనే
సంపదను సృష్టిస్తుందని తెలిపారు. సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి కృషి
చేయాలని,పుస్తక పఠనమును అలవాటుగా మార్చుకోవాలని కోరారు.ఈ సందర్భంగా
మాదకద్రవ్యాలు – యువతపై ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి.ఈ
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, కార్యదర్శి
చిన్నసాని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాసంస్థల నుండి దాదాపు
300 మంది బాల బాలికలు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.