శ్రీకారం చుట్టిన మహానేత మహనీయులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని వారి సేవలను
నరసరావుపేట లోక్ సభ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడారు. జన చైతన్య
వేదిక ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ సాయంత్రం గుంటూరులోని జన చైతన్య వేదిక రాష్ట్ర
కార్యాలయ హాలు లో నిర్వహించిన జవహర్ లాల్ నెహ్రూ 134వ జయంతి సభకు జన చైతన్య
వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.
ప్రధాన వక్తగా విచ్చేసిన లోక్ సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ
భారతదేశ మొదటి ప్రధానిగా 17 సంవత్సరాల పాటు కృషి చేసిన మహనీయులు జవహర్ లాల్
నెహ్రూ అని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయటం,మిశ్రమ ఆర్థిక
వ్యవస్థను ప్రవేశపెట్టడం, పంచవర్ష ప్రణాళికతో ప్రణాళిక బద్ద అభివృద్ధికి కృషి
చేయటం, అలీన ఉద్యమానికి నాయకత్వం వహించడం, లౌకికవాద సోషలిస్ట్ భావజాలంతో భారత
ప్రజలను ముందుకు నడిపిన అత్యున్నతమైన ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ కృషిని భారత
ప్రజలు మరువలేమన్నారు.
స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తొమ్మిది సంవత్సరాల పాటు జైలు
జీవితాన్ని అనుభవించినారని వివరించారు. ప్రముఖ రచయితగా డిస్కవరీ ఆఫ్ ఇండియా,
గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, టు వర్డ్స్ ఫ్రీడం లాంటి పుస్తకాలు
రచించినారన్నారు. సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గత 68 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా
నెహ్రూజీ పుట్టిన రోజును జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. నేడు
కొందరు నెహ్రూ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని భారత ఆర్థిక వ్యవస్థకు
ప్రభుత్వ రంగం ద్వారా పునాదులు వేసిన మహనీయులని తెలిపారు.
నెహ్రూ ప్రగతిశీల సామాజిక విధానాలను అవలంబిస్తూ ఐఐటీలు,ఐఐఎంలు, ఎన్ఐటీల తో
పాటు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు,భారీకర్మగారాలు, విశ్వ విద్యాలయాలను
స్థాపించి భారత ప్రగతికి కృషి చేశారని వివరించారు.శాసనమండలి విప్ డొక్కా
మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ గాంధీజీ,అంబేద్కర్, నెహ్రూ లేకుండా ఆధునిక
భారతదేశాన్ని ఊహించలేమన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు
నిర్మాణానికి,జాతి ఐక్యత, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పారిశ్రామికీకరణ, విద్యా
విధానం, మతసామరస్యం లాంటి భావాలతో నెహ్రూజీ భారతదేశాన్ని ప్రపంచ పటంలో
సగర్వంగా ఉంచగలిగారన్నారు. శాసనమండలి విప్ జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ
దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా భారత రాజ్యాంగాన్ని
రూపొందించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో పాటు నెహ్రూజీ చేసిన కృషి
అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి
సంగిరెడ్డి హనుమంత రెడ్డి,దీక్ష పౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకృష్ణ,తుళ్లూరు
సూరిబాబు లతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు,మేధావులు పాల్గొని ప్రసంగించారు.
తొలుత జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.