విజయవాడ: సంక్షేమం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా
నిలిచిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
తెలిపారు. మంగళవారం 63 వ డివిజన్ 274 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక
కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
నిర్వహించారు. తొలుత దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి
ఘన నివాళులర్పించారు. అనంతరం కొత్త రాజీవ్ నగర్లోని వీధులలో విస్తృతంగా
పర్యటించి 463 ఇళ్లను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
స్వయంగా సంతకం చేసిన కరపత్రంతో పాటు మూడేళ్ల కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి,
సంక్షేమ పథకాలు వివరాలతో కూడిన బుక్ లెట్లను అందజేశారు. అర్హత ఉండి సంక్షేమ
పథకాలు అందని వారి వివరాలు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం
కొరకు అధికారులకు సూచించారు. ఇళ్లల్లోకి ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ను తక్షణమే
తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన ప్రదేశాలలో కొత్త స్తంభాలను
ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా
ఉంచాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా రెండు పూట్ల ఫాగింగ్, మందు పిచికారీ
చేయాలన్నారు.
సచివాలయ పరిధిలో రూ. 4.94 కోట్ల సంక్షేమం
274 వ వార్డు సచివాలయ పరిధిలో గత మూడేళ్లలో రూ. 4.94 కోట్ల సంక్షేమాన్ని
అందజేసినట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 282
మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు
తెలిపారు. అమ్మఒడి ద్వారా 325 మందికి రూ. 48.75 లక్షలు., విద్యాదీవెన మరియు
వసతి దీవెన ద్వారా 107 మందికి రూ. 3.98 లక్షలు., చేయూత ద్వారా 100 మందికి రూ.
18.75 లక్షలు., కాపునేస్తం ద్వారా 25 మందికి రూ. 3.75 లక్షలు., సున్నావడ్డీ
ద్వారా 530 మందికి రూ. 9.50 లక్షలు., చేదోడు ద్వారా 16 మందికి రూ. 1.60
లక్షలు., జగనన్న తోడు ద్వారా 14 మందికి రూ. 1.40 లక్షలు., వాహనమిత్ర ద్వారా 34
మందికి రూ. 3.40 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు
వివరించారు. అలాగే డివిజన్లో 33 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 19.75
లక్షల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. అనంతరం మూడు రోజుల పర్యటనలో తనపై చూపిన
ప్రేమానురాగాలకు డివిజన్ ప్రజలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్
అంబేద్కర్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ అరుణ్ కుమార్, సిడిఓ జగదీశ్వరి,
నాయకులు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, సీహెచ్ రవి, టెక్కెం కృష్ణ, లొనగాని
నాగు, నాగేశ్వరరావు, ఉద్ధంటి శ్రీను, తిరుపతిరావు, నరసారెడ్డి, నరసింహారెడ్డి,
సచివాలయం సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.