ఏలూరు : ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్
సి.హెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం ఏలూరు జిల్లాలోని పెదపాడు
మండలంలో రాష్ట్ర ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి
కమీషన్ సభ్యులు కిరణ్ తో కలిసి పలు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని,
శానిటేషన్ పరిస్థితులను, భోజనం వండే పరిస్థితిలను, కూరగాయలు ఆకుకూరలు, పప్పు
దినుసులను, కోడిగుడ్లను అన్నిటిని కూడా సోదాహరణంగా తనిఖీ చేశారు. అప్పనవీడు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల, కలపర్రు జిల్లా పరిషత్
ఉన్నత పాఠశాల, మండల పరిషత్ మరియు వట్లూరు జిల్లా పరిషత్ పాఠశాల ను
సందర్శించారు.
ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి
మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల ఆరోగ్య రీత్యా ,
చక్కటి మెనూ ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న
గోరుముద్దపై అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ,ప్రత్యేకమైన
శ్రద్ధ తీసుకుని అందరికీ రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. తద్వారా
అనారోగ్య కారణాలు ఎదుర్కోవచ్చని, పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థులు
ఆరోగ్యరీత్యా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారని, ప్రభుత్వం సరఫరా చేసే బియ్యంలో
ఫోర్ట్ పైడ్ రైస్ కలపడం వల్ల విద్యార్థుల్లో ,ఐరన్ లోపం అందు, బి విటమిన్
లోపాలను అధిగమించవచ్చన్నారు. తద్వారా మంచి ఆరోగ్యం పెంపొందించుకోవడం ద్వారా
చదువుపై పూర్తి సమయాన్ని వెచ్చించవచ్చని తెలియజేశారు వారి సందర్శించిన 5
పాఠశాలలు మధ్యాహ్న భోజనం పై పూర్తిస్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తూ, కలపర్రు
పాఠశాలలొ నూరు శాతం విద్యార్థులు భోజనం తినుచున్నందున పదివేల రూపాయిు విలువ గల
గిఫ్టును పాఠశాలకు పంపిస్తానని అందరి హర్షద్వానాల మధ్య తెలియజేశారు. కలపర్రు
జెడ్పి పాఠశాలలో విద్యార్ధులతో కలిసి భోజనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కిరణ్, ఏలూరు ఉప విద్యాశాఖధికారి కె. లావణ్య,
ప్రధానోపాధ్యాయులు రంగా ప్రసాద్, సురేష్, ఆదిలక్ష్మి రాజేశ్వరరావు ,సావిత్రి ,
రవి కాంత్, జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్.ఎస్.ఎస్.ఎస్. రాజు, ఐసిడిఎస్ పిడి
పద్మావతి, సిడిపిఓ రాజశేఖర్, మండల విద్యాశాఖ అధికారి సబ్బితి నరసింహమూర్తి,
తదితరులు పాల్గొన్నారు.