ప్రతి పది మంది వయోజనులలో ఒకరిలో ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆంధ్రప్రదేశ్
గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వ్యాధి సోకిన వారిలో సగం మందికి
మధుమేహం ఉందని కూడా తెలియదన్నారు. విజిఆర్ డయాబెటీస్ ఎడ్యుకేషన్, అవేర్నెస్
ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో
నిర్వహించిన ప్రపంచ మధుమేహ దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ హరిచందన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధికంగా
మధుమేహ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారని, వారి సంఖ్య చాలా వేగంగా
పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. తగిన ప్రచారం ద్వారా నివారణ, సంరక్షణలపై
అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మధుమేహం రాకుండా ఎలా నివారించాలో
ప్రజలకు తెలియచెప్పాలన్నారు. సరైన ఆరోగ్య, మౌలిక సదుపాయాలు లేకపోవడం,
అక్షరాస్యత రేటు తక్కువగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలపై ఈ విషయంలో ప్రత్యేక
శ్రద్ధ అవసరమన్నారు. స్థానిక భాషలో ప్రచురణలను ముద్రించి ప్రజలకు పంపిణీ
చేయాలని గవర్నర్ అన్నారు.
ఈ సందర్భంగా వివిధ వైద్య విభాగాలలోని సీనియర్ వైద్యులను గవర్నర్
సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్
డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆర్.పి.సిసోడియా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, యూనివర్శిటీ ఆఫ్
హెల్త్ సైన్సెస్ ఉపకులపతి డాక్టర్ శ్యామ్ ప్రసాద్, రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ
అధ్యక్షుడు డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి, బిజెపి నేత పాతూరి నాగభూషణం, ఇండియన్
సైకియాట్రిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి,
ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి
హాజరైన వారిలో ఉన్నారు.