* మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?
పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా సి. ఎం జగన్ ఆడుతున్న గేమ్ ప్లాన్
సక్సెస్ అయినట్లేనా? ప్రధాని మోదీ రాక సందర్భంగా విశాఖ వేదికగా జరిగిన భారీ
బహిరంగ సభలో జగన్ పరోక్షంగా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ
వికేంద్రీకరణ దిశగా పాలన సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో
విశాఖపట్నం అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రస్తావించిన అంశానికి కొనసాగింపుగా ప్రధాని విశాఖపట్నం పై పొగడ్తల
వర్షం కురిపించిన తీరు చర్చకు దారి తీసింది. దీన్నిబట్టి పరిపాలన రాజధానిగా
విశాఖ ను ఏర్పాటు చేయాలన్న జగన్ సంకల్పానికి మోదీ ఆమోదముద్ర వేసినట్లేనని
పరిశీలకులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళదాం.
విశాఖపట్నం లో ప్రధాని మోదీ పర్యటన ఈ సారి అత్యంత ఆసక్తికరంగా మారింది.
అందుకు ప్రధాన కారణం మూడు రాజధానుల అంశమే..
రాష్ట్ర బీజేపీ నేతలు, గతంలో ఏపీకి వచ్చిన కొందరు జాతీయ నేతలు,
కేంద్రమంత్రులు సైతం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ
వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. వికేంద్రీకరణే ముద్దు అని చెబుతూ
వచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని.. ఆ దిశగా అడుగులు
వేస్తున్నామని సీఎం జగన్, ఇతర కేబినెట్ మంత్రులు పదే పదే ఇదే చెబుతున్నారు.
విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానికి త్వరలోనే అడుగులు పడుతున్నాయని స్పష్టం
చేస్తున్నారు.
దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఆ ఆరోపణల
నుంచి బయట పడేలా ప్లాన్ చేశారు సీఎం జగన్ .. ప్రస్తుతం విశాఖలో ప్రధాని మోదీ
ముందే మూడు రాజధానుల అంశం ప్రస్తావిస్తే.. మోదీ ఎలాంటి అభ్యంతరం చెప్పరని..
దీంతో మూడు రాజధానులకు కేంద్రం మద్దతు ఉందని ప్రజలకు చెప్పే అవకాశం
దొరుకుతుందనేది సీఎం జగన్ లెక్క అని రాజకీయ విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు..
అందరూ ఊహించినట్టే ప్రధాని సభలోనే మూడు రాజధానులపై సీఎం జగన్ క్లారిటీ
ఇచ్చారు.. వికేంద్రీకరణ దిశగా పాలన సాగిస్తున్నామంటూ.. పరోక్షంగా మూడు
రాజుధానులే మా ప్రధాన నినాదమన్న సంకేతాలు ఇచ్చారు. అది కూడా ప్రధాని మోదీ
ముందే.. అయితే నేరుగా ఎక్కడా కూడా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు..
రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకే ఇలా పరోక్షంగా వికేంద్రీ
కరణపై మోదీ సభలోనే సీఎం జగన్ వికేంద్రీకరణ.. పారదర్శక పాలనే తమ విధానమని
పరోక్షంగా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారం టున్నారు. ప్రధాని మోదీ
మాటలు కూడా సీఎం జగన్ వ్యాఖ్యలను సమర్ధించేలానే సాగాయి. విశాఖను పరిపాలన
రాజధానిగా ఏపీ ప్రభుత్వం చెబుతుంటే.. ప్రధాని సైతం విశాఖ పై పొగడ్తల వర్షం
కురిపించారు. దేశానికి ముఖ్య వ్యాపార కేంద్రంగా విశాఖ మారిందన్నారు. దేశానికి
ఒక విశిష్ట నగరంగా విశాఖ గుర్తింపు పొందింది అంటూ ప్రధాని తన మనసులో మాట ట బయట
పెట్టారు. ఇన్ని అర్హతలు ఉన్న విశాఖను రాజధాని కాదని ఎలా చెప్పగలం అని
పరోక్షంగా మోదీ హింటు ఇచ్చారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.