అమరావతి : ప్రార్థించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న అంటుంటారు. ఆ
నినాదంతో పని చేస్తున్న సంస్థ ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’. ఈ ఫౌండేషన్
నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర
కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు.
ప్రతి మనిషి మనసులో ఉండే మానవత్వం, సహాయం చేయాలనే గుణం అని చెప్పు కొచ్చారు
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. సహాయం చేయాలని మనసు ఉంటే
ఎక్కడున్నా చేయొచ్చని దుండ్ర కుమారస్వామి తెలిపారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన
మాట్లాడుతూ అన్ని దానాలలో గొప్ప దానంగా భావించే అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో
గొప్పగా నిర్వహిస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ పై ప్రశంసలు కురిపించారు
దుండ్ర కుమారస్వామి.
అన్ని దానాలలో కల్లా గొప్పదానం అన్నదానం.. ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది
అభాగ్యులకి, ఆకలి తీరుస్తున్న ఆత్మీయ బంధంగా నిలుస్తున్నది రెడీ టు సర్వ్
ఫౌండేషన్ అని చెప్పుకొచ్చారు దుండ్ర కుమారస్వామి. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా
భావించి ఎంతో మంది ఆకలి తీరుస్తోంది ఈ సంస్థ అని చెప్పుకొచ్చారు కుమారస్వామి.
ఉన్నవాడికి ఇచ్చే గుణం ఉండాలని, ఆ గుణం లేనివాడు రోగితో సమానమని దుండ్ర
కుమారస్వామి అన్నారు.
ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో రెండు దానాలు చేయాలని ఒకటి అన్నదానం.. మరోది
అక్షర జ్ఞానం అని అన్నారు దుండ్ర కుమారస్వామి. అన్నదానం వల్ల మనిషి కడుపు
నిండుతుంది. అక్షర ధ్యానం వల్ల అజ్ఞానపు సంకెళ్లు తొలగిపోతాయని తెలిపారు. రెడీ
టు సర్వ్ ఫౌండేషన్ సంస్థ వారు మొదటిదాన్ని బలంగా నమ్మారు.. అన్నదానాన్ని ఒక
యజ్ఞం భావించి ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది అభాగ్యులకు ఆకలి తీరుస్తూ
ఉన్నారు. ఇటువంటి సంస్థకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు
కుమారస్వామి. దానం చేసేవాడే నిజమైన ధనవంతుడని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ కు మీరు
కూడా తోచినంత సహాయం చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
కోరారు.