విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. మారేష్
అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ లందరూ సంఘటితశక్తిగా ఏకతాటిపైకి
వచ్చి వారి హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు పార్లమెంట్లో బీసీ
బిల్లు పెట్టి చట్టసభలలో 50శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడానికి గల్లీ
నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరూ సైనికులు వలె ఉద్యమంలో పాల్గొనాలని
పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అమలవుతున్న నవరత్న పథకాలను
బీసీలందరూ ఉపయోగించుకోవాలని నవరత్న పథకాలు ద్వారా బీసీల జీవనస్థితిగతులు
మారుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు మాదిరిగా ఓటు బ్యాంకు రాజకీయాలు
జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదని కులం మతం పార్టీలు చూడకుండా అర్హత
ప్రామాణికంగా అన్ని సంక్షేమ పథకాలను అందజేయడం హర్షినియమని
పేర్కొన్నారు.
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల దాడుతున్న ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి బీసీలకు ఈ
స్థాయిలో రాజ్యాధికారంలో వాటా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని
పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ
సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మారేష్ మాట్లాడుతూ రాబోయే
రోజులలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ,”నవరత్నాలతో బీసీల అభివృద్ధి”అనే కార్యక్రమం
ద్వారా అన్ని జిల్లాల్లో చర్చ కార్యక్రమాలు రౌండ్ టేబుల్ సమావేశాలు సభలో
నిర్వహించబోతున్నామని తెలియజేశారు .
బీసీల ఆత్మగౌరవాన్ని గౌరవిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి
అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని
గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి వివరిస్తామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల
బలమైన గొంతుకగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ
మైనార్టీ వర్గాలు మరో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అవసరమని భావిస్తున్నారని
పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ,
రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి, జాతీయ బీసీ సంఘం కన్వీనర్
చెరుకుల రాజేందర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు హర్షద్, నీలం వెంకటేష్,
అనంతయ్య, బలరాం, పలువురు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు.