నిర్మాణాన్ని కూడా రాజకీయం చేయాలని చూసే ప్రతిపక్ష పార్టీలు తమ పద్ధతి
మార్చుకోవాలని లేకుంటే ప్రజలే తిరగబడి తరుముతారని రాష్ట్ర పురపాలక,
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సురేష్ అన్నారు. టిట్కో ఇళ్లపై రాద్ధాంతం
చేస్తూ జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమంపై మంత్రి మండిపడ్డారు. దీనిపై మంత్రి
సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళగిరిలో టిడ్కో లబ్ధిదారులు జనసేన పార్టీ
నాయకులను నిలదీసి అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించటమే అక్కడ లబ్ధిదారులకు
అన్ని వసతులు సమకూరాయని చెప్పడానికి నిదర్శనమని అన్నారు. టిడ్కో ఇళ్లపై
రాద్ధాంతం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా
లబ్ధిదారులు ఆ పార్టీ నాయకులను తరిమి కొడతారని అన్నారు. అన్ని వసతులతో
రాష్ట్రంలో ఇప్పటికే 40,576 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించామని డిసెంబర్
నాటికి మరో 1,10,672 ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు
చేపట్టిందని అన్నారు. మార్చినాటికి మిగిలిన 1,10,968 ఇళ్లను పూర్తిచేసేందుకు
ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300
చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించి
ఇస్తుందని మంత్రి చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి 3805 కోట్ల రూపాయల భారం
పడుతుందని చెప్పారు. గతంలో టిడిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో ఎలాంటి మౌలిక
సదుపాయాలు లేకుండా మురికి కూపాలుగా మార్చిన పరిస్థితుల నుంచి ఈ ప్రభుత్వం
వచ్చాక మంచి జీవన ప్రమాణాలు అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని
లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. రోడ్లు, కరెంటు,
తాగునీరు, మురికి నీరు శుద్ధి చేయడానికి ప్లాంట్లు, డ్రైనేజీ అన్ని వసతులతో
సుందరంగా ఇళ్లను తీర్చిదిద్ది లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుంటే జనసేన పార్టీ దీనిని రాజకీయం
చేస్తూ ప్రజల్లో అబద్దాలను నిజం చేయాలనే కుటిల బుద్ధితో చేపట్టిన కార్యక్రమం
ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇందుకు నిదర్శనమే మంగళగిరిలో లబ్ధిదారులే
జనసేన పార్టీ నాయకులపై తిరగబడటం అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే
పరిస్థితి ఆ పార్టీ నాయకులకు ఎదురవటం ఖాయమని, జగనన్న ప్రభుత్వంపై ప్రజలకు
నమ్మకం ఉందని మంత్రి పేర్కొన్నారు.