ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు
వెంకటేశ్వర్లు
అమరావతి : రెవెన్యూ శాఖలోని గ్రామ రెవిన్యూ సహాయకుని స్థాయి నుండి డిప్యూటీ
కలెక్టరు స్థాయి వరకు నవంబర్11 న మొదలైన రెవిన్యూ క్రీడలలో ఒక జిల్లాకి మరో
జిల్లా గట్టి పోటీనిస్తూ ఏంతో ఉల్లాసంగా రెండవరోజుకు చేరాయి. ప్రతీ క్రీడలోనూ
నువ్వా నిన్న అన్నట్లు పోటీపడుతూ ఎక్కడికక్కడ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ
స్నేహపూర్వక వాతావరణములో క్రీడలో సాగుతుంటే మరొక ప్రక్క రెవిన్యూ ఉద్యోగులు
సినీ గాయకులకు, తారలకు మేమేమి తక్కువ కాదంటూ భక్తి పాటలను, సినీ గేయాలను
పాడుతూ, వివిధ పౌరాణిక వేష దారణలో స్కిట్స్ వేస్తూ బహుమతి నీకా నాకా అనెంత
స్థాయిలో ఒకరితో ఒకరు పోటీపడుతూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్లు
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు
వెంకటేశ్వర్లు తెలిపారు.
రెండవ రోజుకి చేరిన రెవిన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవములలో సాయంత్రము 6 గంటల
నుండి సినీ గాయకులు సునీత, సింహా, సాయి భార్గవి తదీతరులచే సంగీత విభావరి
కార్యక్రమము, కాంప్ ఫైర్ నిర్వహించగా ఉద్యోగుల ఉర్రూతలూగుతూ పదం కలుపుతూ
నాట్యలతో ఉల్లాసంగా సాగాయి. కాగా 6 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడలు,
సాంస్కృతిక ఉత్సవములు – 2022 ముగింపు ఉత్సవములు 13ఆదివారం సాయింత్రం 4
గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రెవిన్యూ, రిజిస్ట్రెషన్,
స్టాంపుల శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ
సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరవుతారని, వారిచే క్రీడలు, సాంస్కృతిక
పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవము జరుగుతుంది. ఈ ముగింపు పండుగలో
ప్రత్యేక ఆతిదిగా అంతర్జాతియ్య బాట్మెంట్టెన్ క్రీడాకారులు కిదాంబి
శ్రీకాంత్, మంత్రులు బొత్స సత్యనారాయణ , ఆర్.కె.రోజా, ఆదిమూలపు, అంబటి
రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజనీ ఇంకా అనేక మంది ఉమ్మడి గుంటూరు
జిల్లాలోని ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు, అనేక మంది పెద్దలు అతిధులుగా
హాజరవుతారు. ఆలాగే 13 వ తేది ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు జరిగే క్రీడల
ముగింపు సభకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పచ్చిమ గోదావరి జిల్లాల లో నుండి గ్రామ
రెవిన్యూ సహాయకుని నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు గల రెవిన్యూ
ఉద్యోగులందరూ ముగింపు కార్యక్రమములో పాల్గొని 6 వ రాష్ట్ర రెవిన్యూ క్రీడలి,
సాంస్కృతిక ఉత్సవములు-2022 జయప్రదం చేయాలని ప్రతి ఒక్క రెవిన్యూ ఉద్యోగిని
బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.