చేతుల మీదుగా ప్రారంభించిన రూ.10742 కోట్ల వివిధ అభివృద్ధి పనులు రాష్ట్ర
చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా
శనివారం పలు అంశాలు వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రాజక్టులు
లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఆయన జాతికి అంకితం చేయడం రాష్ట్ర ప్రజలు
గర్వించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో జరిగిన ప్రధాని
భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతం అయ్యిందని ఈ దిశగా కృషి చేసిన ప్రతి
ఒక్కరికీ, సభకు హాజరైన వారందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నానని అన్నారు.
20,400 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో దేశంలోనే అతిపెద్ద మసాలా ప్రాసెసింగ్
యూనిట్ ను పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం గొప్ప
విషయమని విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మసాలా
ఎగుమతులు ముఖ్యంగా కారం, పసుపు రూ.5000 కోట్లుగా ఉన్నాయని, ఈ ఎగుమతులు ఇప్పుడు
మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. ప్రాసెసింగ్ సౌకర్యం కల్పించడం
ద్వారా రాష్ట్రంలో రైతులు, ఇతరులు మరింతగా అభివృద్ధి చెందుతారని తెలిపారు.
లేనిది ఉన్నట్టు-ఉన్నది లేనట్టు సృష్టించడం పచ్చ కుల పార్టీ, టీడీపీ డబ్బా
కుల కరపత్రాల (పత్రికల) సహజ నైజమని అన్నారు. కులగజ్జి తో కట్టు కథలు అల్లి
కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమని, అవివేకమని మండిపడ్డారు. వారికి అనుకూలం
(అను’కులం) కాకపోతే ఎదుటివారిపై బురద జల్లేందుకు ఏది రాసినా ప్రజలు
నమ్ముతారనుకోవడం అమాయకత్వమే అవుతుందని అన్నారు.