3 శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు? ఎక్కడి న్యాయం?
మండల్ కమిషన్ సూచించిన సిఫార్సులను అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం బీసీలకు మరో వెన్నుపోటు పొడవడానికి సిద్ధమైంది
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అమరావతి : భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి బీసీలకు అన్యాయం
చేస్తూనే వెళుతోందని, దీన్నే కొనసాగించాలని కూడా భావిస్తూ ఉందని జాతీయ బీసీ
దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. బీసీలకు వెన్నుపోటు పొడవడమే
లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో చర్యతో అన్యాయం చేయడానికి
సిద్ధమైందని కుమారస్వామి అన్నారు. సామాజిక న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా బీసీలు
ఎదురుచూస్తూ ఉంటే రిజర్వేషన్ ను కేవలం పేదరిక నిర్మూలన కార్యక్రమం కిందనే
ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో రాజకీయ, వాణిజ్య,
వ్యాపార రంగాల్లో అగ్రవర్ణాలు ఎంతగానో ఎదిగాయని, వారి అవకాశాలను ఎవరూ గండి
కొట్టలేదని దుండ్ర కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం
వెళుతున్న తీరు చూస్తుంటే.. బీసీల నోటి దగ్గరి ముద్దను కూడా దూరం చేయడమేనని
అన్నారు దుండ్ర కుమారస్వామి.
పలు రాష్ట్రాల్లో అగ్రవర్ణాల జనాభా చాలా తక్కువగా ఉందని, వారు కూడా ఆర్థికంగా
ఎదిగిన వారేనని, ఇప్పుడు అగ్రవర్ణ సమాజంలో 10 శాతం పేదలు ఎలా ఉంటారో ఆ
అంబేద్కర్ దిగి వచ్చి చెప్పాలని దుండ్ర కుమారస్వామి అన్నారు. స్వతంత్ర భారత
దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేకపోయిందని.. అవకాశాలు లేక
బీసీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దుండ్ర కుమారస్వామి వాపోయారు. తమ జనాభాను
మించిన అవకాశాలను ఇప్పటికే చేజిక్కించుకున్న అగ్రవర్ణాలకు కేంద్ర ప్రభుత్వం
మరింతగా ముందుకు తీసుకుని వెళ్లాలని అనుకోవడం సరిదిద్దలేని తప్పని దుండ్ర
కుమారస్వామి స్వామి అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% విద్య, ఉద్యోగాల్లో
రిజర్వేషన్ కల్పించడం 70 శాతానికిపైగా ఉన్న బీసీలపై వివక్షత చూపడమేనని ఆగ్రహం
వ్యక్తంచేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో మరో 10 శాతం విద్య, ఉద్యోగాల్లో
అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, దేశవ్యాప్తంగా ఉన్న
బీసీ శ్రేణులను బాధించడమే అవుతుందని దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ
తీర్పు విచారకరమని, గతంలో మండల్ కమిషన్ కేసు సందర్భంగా ఇచ్చిన తీర్పుకు ఏ
మాత్రం న్యాయం చేసినట్లు అవ్వదని దుండ్ర కుమారస్వామి అన్నారు.15 శాతం ఉన్న
అగ్ర కులాల వారిలో 10 శాతం మంది పేదవారు ఉన్నారని చెప్పేందుకు ప్రభుత్వం వద్ద
లెక్కలు ఉన్నాయా..? అని దుండ్ర కుమారస్వామి ప్రశ్నించారు. అగ్రకులాల మొత్తం
జనాభా లెక్కలు తీసి, వారిలో పేదరికంలో ఉన్న వారి జనాభా లెక్కల వివరాలు
తెలియజేయాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ జనాభా ఉన్న అగ్రకులాల వారే ఎక్కువగా
పదవులు పొందుతూ ఉన్నారని, బీసీలు రోజు రోజుకీ వెనుకబడిపోతూ ఉన్నారని అన్నారు
దుండ్ర కుమారస్వామి. ఇప్పటికే అగ్రకులాల వారికి అన్ని రకాల వెసులుబాట్లు
కల్పిస్తున్న ప్రభుత్వాలు.. బీసీలపై మాత్రం ఎలెక్షన్స్ సమయంలో అది
ఇస్తున్నాం.. ఇది ఇస్తున్నాం అంటూ కాకమ్మ కథలు చెప్పి నమ్మిస్తున్నాయని
మరోసారి రుజువైందని దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు. ఇకనైనా ఈ ప్రభుత్వాల
వెనుక ఉన్న కుట్రలను మనం తెలుసుకోకపోతే బీసీలకు మరిన్ని గడ్డురోజులు తప్పవని,
వీటన్నిటినీ సమాధానం చెప్పే రోజు తప్పకుండా బీసీల ముందుకు వస్తుందని..
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, లేకపోతే దేశ
వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర
కుమారస్వామి హెచ్చరించారు. దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీల్లోని
కులాలకు చెందిన వారికి చదువు అందకుండా పోయింది. విద్య కొందరి సొత్తుగా మారి..
చదువుకున్న వారు మంచి ఉద్యోగాలు తెచ్చుకుని సామాజికంగా గౌరవంగా బతకాలనే
నిర్ణయంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను తీసుకుని వచ్చారు. ఆయన
ఆశయాలను, ఆకాంక్షలను ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు ఎంతవరకూ నెరవేర్చాయో ఆ నిజా
నిజాలు మనందరికీ తెలిసిన సంగతేనని దుండ్ర కుమారస్వామి అన్నారు. తక్కువ సంఖ్యలో
ఉన్న కుటుంబాలు, సామాజిక వర్గాలకు మేలు చేయడం కోసం ఇలా అందరినీ బాధించడం ఎంత
వరకూ నిజం అని దుండ్ర కుమారస్వామి ప్రశ్నించారు. తాము నష్టపోతున్నామని
గుర్తించిన బీసీ నాయకులు రాజ్యాంగ బద్ధంగా బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం
రిజర్వేషన్లు కల్పించాలని అనేక పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని..
రాజకీయంగా ఎదిగితే కానీ బీసీల లక్ష్యం నెరవేరదని దుండ్ర కుమారస్వామి
అభిప్రాయపడ్డారు. బీసీలే అధికారంలో ఉంటే ఇలాంటి రోజు వచ్చేదే కాదని.. ఇకనైనా
పదవుల్లో బీసీలు ఇతరులను కూర్చోబెట్టకుండా, వారే అధికారాన్ని పొందాలని జాతీయ
బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు.