అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు
కలిశారు. ఇప్పటివరకు మదాసి కురువ, మదారి కురువ కులాలకు ఇచ్చే కుల ధ్రువీకరణ
పత్రాన్ని ఆర్డీవో పరిధి నుంచి ఎమ్మార్వో పరిధిలోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు
ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేసి ముఖ్యమంత్రికి కురువ సంఘాల ప్రతినిధులు
కృతజ్ఞతలు తెలిపారు. కురువ సాంప్రదాయం ప్రకారం కంబలి కప్పి ముఖ్యమంత్రిని
ప్రతినిధులు సన్మానించారు. తమ కులస్ధులు ఎదుర్కుంటున్న సమస్యలను సీఎం
దృష్టికి తీసుకెళ్ళడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. హిందూపురం ఎంపీ
గోరంట్ల మాధవ్‌తో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మదాసి కురువ, మదారి కురువ
సంఘాల ప్రతినిధులు సుంకన్న, శివలింగ, సోమలింగ, సాయిరామ్, మద్దిలేటి తదితరులు
ఉన్నారు.