పేద ప్రజలకు మంచి చేస్తే, అదే జగనన్నను మళ్ళీ గెలిపిస్తుందని అనంతపురం జిల్లా
శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో భాగంగా శింగనమలలో బుధవారం ఆమె పర్యటించారు. గ్రామంలో ప్రతి
వీధికి వెళ్లి ప్రజలను ఆమె కలిశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఇలా ప్రజల మధ్యలో ఉండటం
తెలుగుదేశం పరిపాలనలో ఎన్నడైనా చూశారా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు
రావడం, హడావుడి చేయడం, ఓట్లు అడగడం, ఫొటోలకు ఫోజులివ్వడం.. అంతే, మళ్లీ ఐదేళ్ల
వరకు ప్రజలకు ముఖం కూడా చూపించేవారు కాదని అన్నారు. కానీ జగనన్న పరిపాలనలో
గెలిచిన ఎమ్మెల్యేలందరూ నిత్యం ప్రజల మధ్యనే ఉండటం గొప్ప విషయమ న్నారు.
ఈ సందర్భంగా ఇదే గ్రామంలో లబ్ధిదారు మర్తాడు పర్వీన్ కు జగనన్న రాసిన లేఖను
ఆమె చూపించారు. ఈ మూడున్నరేళ్లలో జగనన్న సంక్షేమ పథకాల ద్వారా
గ్రామం మొత్తం చేకూరిన లబ్ధి రూ.6,43,750 రూపాయలని అధికారులు తెలిపారు.ఈ
కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎంపీటీసీలు,
సర్పంచులు, మండల కన్వీనర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.