మరో ఐదారు నెలల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలు – డ్రెయినేజీల సమస్య లేకుండా చేస్తున్నాం – వేర్పాటువాదం రావొద్దనే వికేంద్రీకరణ నిర్ణయం – ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ – 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం
అనంతపురం నగరంలో అంతర్గత రోడ్ల నిర్మాణంపై చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే
అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంపై ప్రత్యేక
దృష్టి సారించినట్లు చెప్పారు. అనంతపురం నగరంలోని 30వ డివిజన్లో కార్పొరేటర్
నరసింహులుతో కలిసి బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
సంక్షేమ పథకాలతో మూడేళ్లుగా కలిగిన లబ్ధిని ప్రతి ఇంటికీ వివరించారు.
స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని
అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ
అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు
కొనసాగుతున్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రధాన రహదారుల రూపురేఖలను
పూర్తిగా మార్చివేశామన్నారు. ఇదే తరుణంలో ఇంటర్నల్ రోడ్లపై కూడా ప్రత్యేక
దృష్టి సారించామని తెలిపారు. ఇప్పటికే నగరంలో 40 సచివాలయాల పరిధిలో గడప గడపకు
మన ప్రభుత్వం పూర్తి చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి మంచి స్పందన
వచ్చిందని, సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తమవుతోందన్నారు. అవినీతి లేని
పాలనను అందిస్తున్నామని చెప్పారు. స్థానిక సమస్యలు కూడా తమ దృష్టికి
వస్తున్నాయని, వాటిని సాధ్యమైనంత మేరకు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జగన్
మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో తమకు మంచి జరుగుతోందన్న నమ్మకాన్ని
ప్రజల్లో కల్పించినట్లు తెలిపారు.వేర్పాటువాదం రావొద్దనే వికేంద్రీకరణ..
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో వేర్పాటువాదం అనే మాట రాకుండా
ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం
తీసుకున్నట్లు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వెనుకబడిన రాయలసీమ,
ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుంటే చంద్రబాబు కుటిల
రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరినీ అడ్డుపెట్టుకుని ఎలాగైనా
అధికారంలోకి రావాలన్న కాంక్షతో ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై నిత్యం
విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో విషబీజాలు నాటే ప్రయత్నం
జరుగుతోందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రానున్న ఎన్నికల్లో
మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం
చేశారు. కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,
కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు,
కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు