అనంతపురం జిల్లా వై సీపీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కానున్నారు? ప్రస్తుతం ఈ
అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.ఈ
మేరకు పార్టీ అధినేతకు తన రాజీనామా లేఖ పంపారు. ‘మా కుటుంబంలో జరిగిన విషాదం
వల్ల జిల్లా స్థాయి కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నాను, అలాగే
రాయదుర్గం నియోజకవర్గం పై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నందున,
వైసీపీ జిల్లా అధ్యక్షులుగా వేరే వారిని నియమించవలసిందిగా పార్టీ జాతీయ
అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కోరడం జరిగింది. అందుకు ఆయన సమ్మతించారు.
నాకు అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటి వరకు అవకాశం కల్పించినందుకు పార్టీ
అధినేతకు, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, నాకు సహాయ
సహకారాలు అందించిన పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు,
అధికారులకు, జిల్లా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’ అని
రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి ఒక ప్రకటన ద్వారా మీడియాకు
తెలియజేశారు. ఈ క్రమంలో తదుపరి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్ప
జెబుతారు?, ఆ బాధ్యతలు చేపట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? అనే అంశాలు
ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో సామాజిక సమీకరణాలను కూడా
పరిగణనలోకి తీసుకోవచ్చునని భావిస్తున్నారు. ఆహుడా అధ్యక్షుడిగా కొనసాగుతున్న
మహాలక్ష్మి శ్రీనివాస్ కు ఆ బాధ్యతలు అప్పగించవచ్చుననే చర్చ ఎక్కువగా
జరుగుతోంది. మొత్తంమీద ఎన్నికలు రాబోతున్న తరుణం కాబట్టి అన్ని అంశాలను
పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేయవచ్చునని
భావిస్తున్నారు. కాగా, కాపు అల్లుడు మంజునాధరెడ్డి గత ఏడాది ఆగస్టులో ఆత్మహత్య
చేసుకున్నారు. దీంతో ఆప్పటి నుంచి విషాదంలో వున్న కాపు పార్టీ అధ్యక్ష పదవికి
తగిన విధంగా న్యాయం చేయలేకపోయారు. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం విశేషం.