నెల్లూరు : వెంకటాచలం మండలం కాకుటూరులోని శ్రీ మహావీర్ జైన్ మందిరాన్ని
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి
గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. సోమవారం ఉదయం జైన్ మందిరానికి విచ్చేసిన
మంత్రి శ్రీ మహావీర్ స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మందిరంలో
ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జైనుల జీవన విధానం, సంస్కృతి
సంప్రదాయాలు చాలా గొప్పగా ఉంటాయని, వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా
జీవిస్తారన్నారు. ధర్మంగా సంపాదిస్తూ వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని సేవా
కార్యక్రమాలకు ఉపయోగించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి
వచ్చినా, నెల్లూరు ప్రజలను కలుపుకుంటూ సమాజంలో ఐకమత్యం పెంపొందేలా
జీవిస్తారన్నారు. జైనులకు భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను
అండగా ఉంటానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం మంత్రిని జైనుల
సాంప్రదాయం ప్రకారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మందిరానికి
సంబంధించి సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ
కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరమల్ జైన్, నరేంద్ర జైన్, పారస్మల్
జైన్, శాంతి లాల్ జైన్, బావర్ లాల్ జైన్ పాల్గొన్నారు.