ప్రజలకు వివరించాలని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జీవీఎంసీ కార్యాలయంలో సోమవారం జోనల్
కమీషనర్లతో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లు ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ
సందర్బంగా మాట్లాడుతూ ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమమని చెప్పారు. సుమారు రూ.11వేల కోట్లతో
విశాఖ నగరానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు
శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రధాని చేతుల మీదుగా నిర్వహించడం
గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కార్యక్రమం కావడంతో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని
తెలిపారు.
బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, తిరిగి
వారి స్వస్థలాలకు చేరకునేంత వరకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. మొబైల్
టాయిలెట్లు, వైద్య బృందాలు, త్రాగునీరు, స్నాక్స్ ఇతర సదుపాయాలు సమకూర్చాలని
సూచనలు చేశారు. సుమారు రూ.11వేల కోట్లతో ప్రధాని చేతుల మీదుగా జరుగు వివిధ
అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ప్రజలకు వివరిస్తూ, వారిని బహిరంగ సభకు తరలి
వచ్చేటట్టు చేయాలని అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్ర
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమమని క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రజలకు
వివరించేటట్టు చేయాలని కోరారు. ఇది ఒక యజ్ఞంలా చేపట్టాలని అన్నారు. 3 లక్షల
మంది సభకు హాజరయ్యే విధంగా చూడాలని అన్నారు.
సభలో ముందుగా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అనంతరం ప్రధాని
మాట్లాడుతారని, ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదం ఉంటుందని తెలిపారు. అనంతరం
వివిధ జోనల్ కమీషనర్లు ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబంధించి తాము రూపొందించుకున్న
ప్రణాళిక, పై అధికారులు అదేశాల గూర్చి వివరించారు. జీవీఎంసీ మేయర్ గొలగాలి
హరివెంకటకుమారి మాట్లాడుతూ బహిరంగ సభ విజయవంతం చేయడం అధికారులందరి బాధ్యతని
చెప్పారు. ఈ మేరకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచనలు చేశారు.
కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు
ముందు సర్క్యూట్ హౌస్ లో విశాఖ తూర్పు, దక్షిణ నియోజక వర్గాల
ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో ప్రధాని, ముఖ్యమంత్రి బహిరంగ సభకు
సంబంధించిన సన్నాహాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తూర్పు
నియోజకవర్గ సమన్వయ కర్త అక్కరమాని విజయనిర్మల, పరిశీలకుడు చింతలపూడి
వెంకటరామయ్య, దక్షిణ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్, పరిశీలకుడు తైనాల విజయ్
కుమార్, కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.