ఉభయగోదావరి జిల్లాల రజక సంఘం అధ్యక్షులు చాట పర్తి పోసి బాబు
విజయవాడ : రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఉభయగోదావరి జిల్లాల రజక సంఘం
అధ్యక్షులు చాట పర్తి పోసి బాబు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్
వద్ద 2వ రోజు రజకుల ఆత్మగౌరవ దీక్షలో చాట పర్తి పోసి బాబు మాట్లాడుతూ రజకుల
ను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ, రజక మహిళలకు అండగా రక్షణ చట్టం అమలు
చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్వారక తిరుమల రజక సంఘం అధ్యక్షులు చెన్నూరి
శ్రీనివాసరావు, కూచింపూడి సత్యనారాయణ, కంచర్ల రామకృష్ణ, కంచర్ల రాంబాబు,
కంచర్ల రమేష్, తొంటపాక వెంకటేశ్వరరావు,చిలంతరాజుల సుబ్బారావు, కానూరి
వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.