గుంటూరు : ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ ఉన్మాదిలా మాట్లాడారని జలవనరుల శాఖ
మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి
పారదొబ్బాలి అన్న ఒక్క మాట ఆయనలోని ఫ్రస్టేషన్‌ను బయటపెడుతోందన్నారు.
పత్రికల్లో రాతలను పట్టుకుని చంద్రబాబు సలహాతో ఇప్పటం వచ్చి రంకెలు వేసి
వెళ్ళారని మంత్రి ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇవ్వడం వల్లే
తొలగింపులు జరిగాయనటం పూర్తిగా అవాస్తవమని, సభ పెట్టకముందే గత ఫిబ్రవరిలోనే
మార్కింగ్ చేశారని స్పష్టం చేశారు. చంద్రబాబుతో కలిసినప్పటి నుంచి పవన్
కల్యాణ్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. ఏ విగ్రహాలను తొలగించలేదు. ఒక్క ఇల్లు
కూడా ఎక్కడా పడగొట్టకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విస్తరణ దేశంలో
ఎక్కడా జరగలేదా?, అది రెక్కీ కాదు అని పోలీసులు చెప్పారు. ఇప్పటం ఒక
ప్రశాంతమైన గ్రామం, అక్కడ చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబుపై రాయి వేయటం, పవన్‌పై రెక్కీ అనేవన్నీ అవాస్తవం. పవన్ రాజకీయాలకు
పనికి వచ్చే మనిషి కాదు. పవన్ ఫ్యాన్స్‌కి నా మనవి..కుక్క తోక పట్టుకుని
గోదావరి ఈదవద్దు. ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని ఇచ్చావా?, పవన్‌ను
నమ్మి వెళితే జీవితాంతం బాధపడతారు. అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలని
తెలుసుకోండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా.. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని పవన్
కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.