విజయవాడ బ్యూరో ప్రతినిధి : భారత జాతి కల్లోకూడా ఊహించని ఓ దుర్మార్గపు హత్యాకాండ ఓ మహాత్ముడు దుర్మరణం జరిగిన సంఘటన గుర్తు చేస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భవానిపురం ఊర్మిళ నగర్ లోని గాంధిదేశం సోషల్ వెల్పేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నేటి గాంధీ ఆర్ ఆర్ నాగరాజన్ గురువారం తన గాంధీ ఆశ్రమంలో నిరాహారదీక్ష చేశారు. మంచి ఓటు మనమేద్దాం – అది- నుంచి వ్యక్తికే వేద్దాం. వందేమాతరం ఎక్కడికి వెళుతుంది ఈ తరం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ప్రతినెలా 30 వ తేదీన ఇలా దీక్షలు చేపట్టడం తెలిసిందే. జనవరి 30-1948 వ తారీఖున మహాత్మా గాంధీ ని అతిదారుణంగా గాడ్సే హత్య చేసిన రోజు. ఈ తేదీన వివిధ రూపాలలో, కళ్ళకు గంతలతో సత్యాగ్రహ పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేటి గాంధీ విలేకరులతో మాట్లాడుతూ కమిషన్ ఏజెంట్ గా మారినా ఎన్నికల కమిషన్. ఈ రోజు నేను చేస్తున్న నిరాహార దీక్షకి సంబంధించి రాసిన లేఖ, ఎన్నికల కమిషన్కు అందించిన సమాచారం మధ్యాన్ని వెంటనే బ్యాన్ చేయమని, ముందస్తు జాగ్రత్తగా రౌడీషీటర్లని ఆరెస్టు చేయమని నా సలహా పాటించకుంటే శాంతి భద్రతలకి భంగం తప్పదు. ప్రభుత్వ సిబ్బందులు ఎన్నున్న మద్యపాన, మత్తు పానీయాలు నిషేధించకుండా, అది తాగే వారు మీద చర్యలు. మీ రక్షణ దళాలు జరిగే ఘోరాతి ఘోరమైన మారణ కాండాన్ని ఆపలేని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రకటన మూడు రోజులకు ముందు మద్యం నిషేధం అని ప్రకటించింది. మరి మద్యం సేవించే వారి మీద చర్యలని ప్రకటించలేదు. మద్యం తాగడం వల్లే ఇలాంటి ఘోరమైన ఘటనలు. అందులో బలి అయ్యిదే ప్రజలు వాళ్ళ ప్రాణ విలువ గుర్తించాల్సిన పాలకులు, ఎన్నికల కమిషన్అ వసరం కన్నా, వీళ్ళ ప్రమోషన్ కి విలువ ఇస్తున్నారు. అనేది అసలు ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల నిబంధనలు అమలు చేసి యావత్తు భారత దేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు గడగడ లాడించిన మాజీ ఎన్నికల కమిషన్ టి ఎన్ శేషన్ గారేగుర్తు వస్తారు.” ఇప్పుడు వీళ్ళందరూ కమిషన్ ఏజెంట్లే కదా అంటూ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే సామాజిక ప్రజాస్వామ్యా వేదిక ఏర్పరచాలి అని, ప్రజల స్వరం వినిపించాలని, అదే ప్రజాస్వామ్య రక్షణ అని, అందుకై తాను చేపట్టనున్న కఠినమైన ప్రయత్నాలే రేపటి తరాలకి రక్షణ అని, అందుకు నీతి, నిజాయితీకల ప్రతి పౌరుడు,సోషల్మీ డియా సపోర్టు అందించాలని ప్రతికలు ముందు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ పత్రిక వ్యవస్థ నశించాలని, అందుకై మనమందరం కృషి చెయ్యాలని ప్రజలకు ఈ నిరాహార దీక్ష మూలం గా పిలుపునిస్తున్నాను. రక్షించండి ! రక్షించండి!! ప్రజాస్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించటం కోసం బ్రతుకుదాం!బ్రతికితే దేశం కోసం – చస్తే దేశం కోసం అని గాంధీ నినాదాలు చేశారు.