కౌంటింగ్ కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్,సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
ఎన్నికల కమీషన్ ను కలసి విజ్ఞప్తి చేసిన వైయస్సార్ సిపి ఎంఎల్ఏ మల్లాదివిష్ణు, నవరత్నాల నారాయణమూర్తి
వెలగపూడి, ప్రధాన ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజున,ఆ తర్వాత రాష్ర్టంలోని పలు ప్రాంతాలలో హింసకు,దౌర్జన్యాలకు పాల్పడిన దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బంధి భధ్రతా చర్యలు చేపట్టాలని వైయస్సార్ సిపి ఎంఎల్ఏ మల్లాది విష్ణు,గ్రీవెన్స్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు నారాయణ మూర్తిలు ఎన్నికల కమీషన్ నుకోరారు. కౌంటింగ్ కేంద్రాలలో వీడియో రికార్డింగ్ సిసిటివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు టిడిపి వర్కర్స్ తో దాడి చేయించారు. వైయస్సార్సిపి కి చెందిన నిమ్మాడ పంచాయితీ చినవెంకటాపురంకు చెందిన తోటమల్లేష్ పై దాడిచేశారు. మల్లేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఆ సంఘటన టిడిపి రిగ్గింగ్ ను అడ్డుకున్నందుకు అతనిపై దాడి చేయించారు, కాబట్టి ఎన్నికల నియమనిభందనలను అనుసరించి అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్, ఎంపీ అభ్యర్ది రామ్మోహన్ నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దెందులూరు టిడిపి అభ్యర్ది చింతమనేని ప్రభాకర్ ఎన్నికల సందర్బంగా వైయస్సార్ సిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. దళితులకు సంబంధించి దూషణలు చేశారు.ఈ నేపధ్యంలో పెదగిరి మండలం కొప్పుల వారి గూడెంకు చెందిన రాజశేఖర్ ను అరెస్ట్ చేశారు.పోలీసులపై దాడి చేసి అతనిని విడిపించుకుని వెళ్లారు.కాబట్టి అతని పై కఠిన చర్యలు తీసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ కుసంబంధించి రిటర్నింగ్ అధికారులకు అందిన వాటిలో కవర్లపై పేర్లు లేకపోవడం, ఇతరత్రా సంతకాలు లేకపోవడం వంటివి ఉన్నాయి.వాటికి సంబంధించి ఎన్నికల కమీషన్ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని సరైన పధ్ధతిలో కౌంటింగ్ చేయాలని కోరుతున్నామన్నారు.