పల్నాడు బ్యూరో ప్రతినిధి : సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడు జరగలేదని మంత్రి అంబటి అన్నారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని.. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలి పెట్టి వెళ్లిపోయారని, వారికి భరోసా కల్పించి ఊరిలోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి అన్నారు. తాజాగా పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులపైన కూడా సిట్ బృందానికి మంత్రి వివరించారు.