విజయవాడ , ప్రధాన ప్రతినిధి : తాను నిర్వహించే ఏ పదవికైనా వన్నె తెచ్చే సమర్ధవంతమైన నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్ అని పలువురు ఎస్సీ నాయకులు కొనియాడారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ స్టేట్ నాయకుడు జోసెఫ్ శివమణి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ గా నియమితులైన ఆకుల శ్రీనివాస్ ను ఎస్సీ విభాగం నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సీ నాయకులు మాట్లాడుతూ వైసీపీకి ఆకలి శ్రీనివాస్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా సీఎం జగనన్న ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం జగనన్న మరోసారి సీఎం కావాలని రాష్ట్ర ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో సీఎం జగనన్న వెలుగులు నింపారని ఆకుల శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పోలిమెట్ల శరత్ ,ఎస్సీ సెల్ సిటీ ప్రెసిడెంట్ భుధాల శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తాండ్ర ఇంద్ర కుమార్ , సిటీ యూత్ ప్రధాన కార్యదర్శి జమలపుడి మార్క్ , స్టేట్ ఎస్సీ నాయకుడు లెళ్లపుడి లాజర్ , డివిజన్ ప్రెసిడెంట్ ఎద్దు సురేష్ , కె. రాజు ,ఎన్ .సుబ్రమణ్యం , కొమ్ము జోసెఫ్,పి.నాగరాజు , ఎం. జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు.