నమ్ముకున్న సిద్ధాంతం కోసం పేదల పక్షాన నిలబడ్డ జగన్
మీరు దీవిస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది
నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్
సత్తెనపల్లి బ్యూరో ప్రతినిధి :
సర్వమత శ్రేయోభిలాషి జగన్ అని నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ అన్నారు. ఆయా సంఘాల బాధ్యులు జోసఫ్ రాజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలను మీరు సన్మార్గంలో నడిపించేవారు. మీకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీయ కూడదున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనిని భూతద్దంలో పెట్టి వెతికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారన్నారు. బిజెపి ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తానన్న చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని నిప్పులు చెరిగారు. మీ అందరూ మంచి మనసుతో దీవిస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని, పదిమందిని ప్రభావితం చేస్టారని, మంచి చేసిన ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టాలన్నారు. నియోజక వర్గంలో కల్యాణ మండపం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని అనిల్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి ,ఏఎంసీ చైర్మన్ పెండెం బాబురావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలక జైపాల్, సంఘ కాపరులు ఉన్నారు.