చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను కోరిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి
వెలగపూడి, ప్రధాన ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కడప జిల్లాలోని పోలింగ్ బూత్ లలో మహిళలకు కల్పిస్తున్న సదుపాయాలు తనిఖీ చేయుటకు అనుమతి ఇవ్వాలని శుక్రవారం వెలగపూడి సచివాలయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి వినతి పత్రం . 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అన్ని పోలింగ్ బూత్ లలో మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సానుకూలంగా స్పందించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంబంధిత డిఇఓ లకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. కడప జిల్లాలో పోలింగ్ బూత్ లలో మహిళలకు ముఖ్యంగా బాలింతలు, గర్భిణీలు, వృద్ధులకు 2024కల్పిస్తున్న
సౌకర్యాలను పరిశీలించేందుకు అనుమతించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కోరారు. అన్ని పోలింగ్ బూత్ ల వద్ద మహిళలకు వేరుగా క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలి. చిన్న పిల్లలతో వచ్చే బాలింత లకు, గర్భవతులకు పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలి. గర్భవతులకు అత్యవసరమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో ఎలక్షన్ నాటికి పెరిగే ఉష్ణోగ్రతలు దృష్ట్యా మహిళలు వడ దెబ్బకు గురి కాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షెల్టర్, త్రాగు నీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మహిళల కొరకు అత్యవసర వైద్య సేవలు కొరకు తగు సిబ్బంది అందుబాటులో ఉంచాలి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలకు విధిగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి.
అత్యవసర సందర్భాల్లో మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపుల విషయాల్లో వారికి తగు న్యాయం జరుపుట కొరకు బాధితులను పరమర్శించుటకు మహిళా కమిషన్ చైర్-పర్సన్, మెంబర్లకు ఎన్నికల నిబంధనలలో సడలింపు ఇవ్వాలని కోరారు.