కాకినాడ : ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల కృష్ణుడు టీడీపీకి రాజనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక, ఇటీవలి కాలంలో యనమల సోదరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా తునిలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. గత నలభై ఏళ్లుగా అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉన్న తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక, తునిలో రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడానికి కృష్ణుడే కీలక పాత్ర పోషించాడు. అయితే, 2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు ఓడిపోవడంతో అసలు కథ మొదలైంది. యనమల కృష్ణుడి స్థానంలో తన కుమార్తెకు రామకృష్ణుడు ఎన్నికల బరిలోకి దింపారు. చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి తన కుమార్తె దివ్యకు సీటు వచ్చేలా రాజకీయం నడపారు. ఈ క్రమంలో యనమవ కృష్ణుడిని ఆయన దూరం పెట్టారు. దీంతో యనమల సోదరుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈసారి జరిగే ఎన్నికల కోసం కృష్ణుడు ప్రణాళికలు చేసుకున్నప్పటికీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తన కుమార్తె దివ్యను ఎలాగైనా గెలిపించే చర్యల్లో భాగంగా రామకృష్ణుడు పార్టీలోకి ఇతరులను కలుపుకుని వెళ్లే చర్యలు చేపట్టారే కానీ సొంత సోదరుడు కృష్ణుడును బుజ్జగించే చర్యలు చేపట్టలేదు. దీంతో ఆయన మరింత మనస్థానపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.