అమరావతి బ్యూరో ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3గంటలతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల కు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. కొన్ని చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు.