ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్
గిరిజనుల పేరేత్తే అర్హత చంద్రబాబుకు లేదు
గిరిజనులంతా వైఎస్ఆర్సిపి వైపే ఉన్నారు
అమరావతి బ్యూరో ప్రతినిధి : టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజన ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ అన్నారు. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు. గిరిజనులంతా వైఎస్ఆర్సిపి వైపే బలంగా నిలబడి ఉన్నారని అన్నారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో 7 స్థానాలతో పాటు రాష్ట్రంలోని అన్ని స్థానాల విజయానికి గిరిజనులు తన వంతు కృషి చేస్తుందని అన్నారు. ఆదివారం మీడియాతో రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతూ చంద్రబాబు అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నాడు. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా బాబు గిరిజనుల కోసం ఏం చేశాడు?. గిరిజన కార్పొరేషన్ వేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదన్నారు. చంద్రబాబు గిరిజన శాఖకు మంత్రిని ఎందుకు పెట్టలేకపోయావని గుర్తు చేశారు..? గిరిజనుల పేరెత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదని, గిరిజనులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే గిరిజనులకు మేలు చేశారన్నారు. దేశంలో ఎవరూ చేయలేనంత సంక్షేమం, అభివృద్ది గిరిజనులకు సీఎం జగన్ వల్లే అందిందన్నారు. మూడు లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు జగన్ మోహన్ రెడ్డి పట్టాలిచ్చారు. చంద్రబాబు ఒక్క ఎకరమైనా పోడు భూమి పట్టా ఇవ్వగలిగారా. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేశారు. ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేశారు. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనన్నారు. నంద్యాలలో మెడికల్ కాలేజీ ఎర్పాటు ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల కోసం 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి 20 వేల కోట్ల రూపాయలు గిరిజనుల కోసం వారి సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని గిరిజనులు పోగొట్టుకునే స్థితిలో లేరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక చంద్రబాబు చేతకాని తనాన్ని ప్రజలు తెలుసుకున్నారన్నారు. గిరిజనులకు అన్యాయం చేసింది చంద్రబాబే, తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే చంద్రబాబు మేలు చేశాడని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లు, మౌలిక సదుపాయాలను ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో గిరిజనులు ముఖ్యమంత్రి జగన్‌కు అండగా ఉండి సీఎం జగన్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని కానుకగా ఇస్తామన్నారు.