ప్యాపిలి పట్టణంలో మంత్రి బుగ్గన సమక్షంలో భారీగా చేరికలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న 500 కుటుంబాలు
గుత్తిలో వివాహ వేడుకకు హాజరైన ఆర్థిక మంత్రి
ప్యాపిలిలో కమతం భాస్కర్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరు
ప్యాపిలి, నంద్యాల జిల్లా బ్యూరో ప్రతినిధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పినట్లే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వెల్లువెత్తాయి. ప్యాపిలి పట్టణంలోని 500 కుటుంబాలు మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ప్యాపిలి, కలచట్ల, ఎస్.రంగాపురం, నల్లబల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆర్థిక మంత్రి బుగ్గన ఆహ్వానించారు. మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చి పార్టీలో చేరడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతుందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ప్యాపిలి మండలంలో మంత్రి బుగ్గన చేపట్టిన అభివృద్ధి గతంలో తమ ప్రాంతంలో మరే నాయకుడు చేయలేదని మంత్రి కృషిని కొనియాడారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మంత్రి బుగ్గన చేపట్టిన అభివృద్ధివల్ల ప్యాపిలి స్వరూపమే మారిపోయిందన్నారు. అందుకు కృతజ్ఞతగా మహిళలకు మంత్రి బుగ్గన అభివాదం చేశారు. ప్యాపిలి పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో భారీ రోడ్ షో జరిగింది. వందలాది జనం మధ్య పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. వందలాది మంది మంత్రి రోడ్ షోకు హాజరై తమ మద్దతు తెలిపారు. అడుగడుగునా పూలమాలలు వేస్తూ మంత్రికి హారతులు పట్టారు. అక్కడి నుంచి మంత్రి శ్రీరామా టాకీస్, నడిమిగేరి. నేసేపేట మీదుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద మంత్రికి క్రేన్ సాయంతో గజమాలతో ఘనస్వాగతం పలికారు. గడపగడపకు తిరుగుతూ మంత్రి చేసిన అభివృద్ధిని తెలిపే కరపత్రాలను అందజేస్తూ వారికి ప్యాపిలి ప్రగతిని మంత్రి స్వయంగా వివరించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్యాపిలికి వచ్చిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మంత్రికి విజయ తిలకం దిద్ది హ్యాట్రిక్ విజయం బుగ్గనదేనంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. అనంతరం పట్టణంలోని బీసీ కాలనీ హుసేనాపురం వీధుల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జనంతో మమేకమయ్యారు.
అనంతరం గుత్తిలో జరిగిన జెరిబండ వారి పెళ్లి వేడుక కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు. మూడు ముళ్లతో ఒక్కటైన నూతన వధూవరులు శివకృష్ణారెడ్డి, గ్రీష్మనందినిలను మంత్రి బుగ్గన ఆశీర్వదించారు. అనంతరం ప్యాపిలి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కమతం భాస్కర్ రెడ్డి గృహ ప్రవేశానికి మంత్రి బుగ్గన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామి రెడ్డి, సర్పంచ్ లక్ష్మీదేవి, వ్యవసాయ సలహామండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బొర్రా మల్లికార్జునరెడ్డి, మాజీ జడ్పీటిసి దిలీప్ చక్రవర్తి , సింగిల్ విండో అధ్యక్షులుబోరెడ్డి రాము, అడ్వకేట్ నాగభూషణం రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పోతుదొడ్డి కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకులు రామచంద్రారెడ్డి, రాజా మురళీకృష్ణ, చిన్న సుంకయ్య, శ్రీనివాసరెడ్డి , వెంకటేశ్వర రెడ్డి, రజనీ రెడ్డి, గండికోట చిన్న రామాంజనేయులు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.