కాకినాడ : కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి 18వ రోజు బస్సుయాత్ర ప్రారంభమైంది. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరారు. నెల్లూరు జిల్లా జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి వున్నారు. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.