విజయవాడ: సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో వైఎస్ఆర్ పార్టీ తరపున నామినేషన్ వేస్తున్న సంధర్భంగా తిరుపతిలో ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. విజయవాడ నుండి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి. ప్రసాదాలు,శాలువా, అక్షింతలు తీసుకువెళ్ళు అయనకు అందచేశారు.ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ 13వ సారి శాసన సభ్యులుగా వైఎస్ఆర్ పార్టీ తరపున నామినేషన్ వేస్తున్న సందర్భంగా కనక దుర్గ అమ్మవారు, తిరుమల శ్రీవారి అస్సీసులు ఉండాలని, అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రజలకు మరింత సేవ చేయడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ కలసి అభినందనలు తెలియ చేయడం జరిగిందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస కుమార్ తెలిపారు.