కాకినాడ బ్యూరో ప్రతినిధి : కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి రాజపురం నైట్ స్టే పాయింట్ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి 18వ రోజు బస్సుయాత్ర ప్రారంభమైంది. గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ముఖ్య నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా ఎస్.టీ. రాజపురం స్టే పాయింట్ వద్ద గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించారు టీడీపీ నుంచి వైయస్సార్సీపీలో మాజీ కార్పొరేటర్ ఎస్.కె.సైదా, మొండి బండ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మాధవ యాదవ్ చేరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజిని పాల్గొన్నారు.