ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించి
ఈసారి ఎంపీ స్థానం కూడా మనమే గెలవాలి
జలుమూరు మండలం లిఃగాలవలస పంచాయతీలో ముమ్మరంగా వైసీపీ ఎన్నికల ప్రచారం
జలుమూరు బ్యూరో ప్రతినిధి:
ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పాలనకు ఓటు వేయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. సోమవారం జలుమూరు మండలం లింగాలవలస పంచాయతీలో రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు ఎన్నికల ప్రచారం కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం విడిచి పారిపోయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదవీ దాహంతో ఇప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చి అబద్ధపు మాటలు చెప్పి అధికారం రాబట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వీరి మాటలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులో లేరని అన్నారు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా ప్రచారం చేపట్టినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. అడుగడుగునా కుంకుమ తిలకాలు అద్ది పూలదండలు… కర్పూర హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ వైస్ ఎంపీపీ తంగి మురళీ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, పిఎ సిఎస్ అధ్యక్షులు మొజ్జాడ శ్యామలరావు పాగోటి రాజప్పలనాయుడు ఏఎంసీ చైర్మన్ పెరుమళ్ళ తవిటి నాయుడు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు పైడి విటల్ రావు, జె సి ఎస్ కన్వీనర్ ధర్మాన జగన్ , దాము మన్మధరావు వెలమల అసిరినాయుడుతోపాటు స్థానిక సర్పంచ్, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి గురువిల్లి రమణి, మాజీ పిఎ సిఎస్ అధ్యక్షులు పోన్నాన ముసలినాయుడు, బుక్కా లక్ష్మణరావు, ఎంపీటీసీ బుక్కా కామేశ్వరరావు, కుమార్, సర్పంచులు ఎంపీటీసీలు ధర్మాన రమణ, తర్ర మన్మధ, జీవరత్నం, తండ్యాల సుధ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.