ప్రజా నాయకుడికి కుట్రల కూటమి దిష్టి తొలగిపోయింది
అమరావతి బ్యూరో ప్రతినిధి: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఇటీవల సీఎం జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం సీఎంను కలిసి యోగక్షేమాల గురించి మాట్లాడారు. కేసరపల్లిలో ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంగణంలో సమావేశమై ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 15వ రోజు ‘మేమంతా సిద్ధం’ యాత్రకు సీఎం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో బస్ లోనే సీఎంను మంత్రి బుగ్గన కలిశారు. అంతులేని ప్రజాదరణ కలిగిన ప్రజా నాయకుడికి ఎన్ని కుట్రలు పన్నినా ఏం కాదని ముఖ్యమంత్రితో అన్నారు. రాళ్ల దాడి ఘటనతో ముఖ్యమంత్రికి తగిలిన ప్రతిపక్షాల దిష్టి తొలగిపోయిందన్నారు.