కోవిడ్ సమయంలో మిమ్మల్ని సంక్షేమంతో ఆదుకున్నాం
భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటాం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి
తణుకు : కార్మికుల పిల్లలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లను చేయాలనే తపనతోనే సంక్షేమంలో విద్యారంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక శాతం ప్రాధాన్యతనిచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో భవన కార్మికుల సంఘ సభ్యులతో ఆదివారం రాత్రి సంఘ భవనంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కార్మికుల పిల్లలు అదే పనుల్లో స్థిరపడే వారని, కులవృత్తుల్లో ఉన్న వారి పిల్లలు అదే వృత్తిలోకి వచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. సీఎం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి విద్య ద్వారా పేద కుటుంబాన్ని ఉన్నతస్థాయికి చేర్చవచ్చని తద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయవచ్చని నిరూపించారన్నారు. పాఠశాల విద్యలో అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, కళాశాల, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యలో విద్యా దీవెన, వసతి దీవెనతో పేదింటి పిల్లలను ఉచిత విద్యద్వారా ఉన్నతస్థాయికి చేర్చి చదువుల విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇంజనీరింగ్ విద్యలో కేవలం రూ.35వేలు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్ గా ఇచ్చేవాడని కానీ మీ జగనన్న వచ్చిన తరువాత పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ ఇచ్చి ఎంత చదివితే అంతా ఉచితమేనని గుర్తుచేశారు. కోవిడ్ సమయంలో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌లో వైద్యానికి రూ. 60వేల కోట్లు ఖర్చుచేయడమే కాకుండా క్యాలండర్ ప్రకారం సంక్షేమ పథకాలను అందచేసి మీకు అండగా నిలబడిన విషయం కూడా మరువవద్దని సూచించారు. మీ కుటుంబసభ్యుడిగా మీలో ఒకడిగా మీకు అందుబాటులో ఉంటానని, నాతో ఏ పనిఉన్నా నన్ను కలవాలంటే ఎలాంటి సిఫార్సులు అవసరంలేదని నేరుగా తనను కలవవచ్చని చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభలకు సంబంధించి రెండు ఓట్లును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడతానని, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెయింటర్స్ అసోసియేషన్ కు భవనాన్ని నిర్మింపచేసి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం తరపున మంత్రి కారుమూరికి తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందచేయగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పాడు. అనంతరం మంత్రి కారుమూరిని సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఇంటి వీరన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నరాల వెంకటేశ్వరరావు, సంఘ తణుకు అధ్యక్షుడు కొమ్మన విష్ణు, కోశాధికారి సుంకర ప్రసాద్, పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.బాబూరాజేంద్రప్రసాద్, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, మంగెన సూర్య, మారిశెట్టి శేషగిరి, గారపాటి సత్యనారాయణ, శంకర్ విలాస్ చిన్ని, కుడుపూడి చందర్రావు, రామకృష్ణ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.