తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పట్ల రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా సంతృప్తి
కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం పరిశీలన
అధికారులు, సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం
స్వీప్ ఫోటో ప్రదర్శన తిలకించిన రామ్ మోహన్ మిశ్రా
రాజమహేంద్రవరం బ్యూరో ప్రతినిధి : జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలు మేరకు వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా కలక్టరేట్ లో ఎన్నికల నేపధ్యంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత , ఎస్పి జగదీష్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా రామ్ మోహన్ మిశ్రా సువిధ, తదితర విభాగాల్లో నిర్వహిస్తున్న రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతికూల వార్తలు, సంఘటనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన నేపధ్యంలో అధికారులు చేపడుతున్న కార్యకలాపాల పై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది,అధికారులతో మిశ్రా సంభాషించి రికార్డుల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకుని వారికి ఉన్న అవగాహన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సి విజిల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి కి సంబంధించి తీసుకున్న చర్యల గురించి పరిశీలకులకు కలెక్టర్ మాధవీలత వివరించారు. రెవిన్యూ, పోలీసు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
తొలుత కలెక్టరేటులో ఏర్పాటు చేసిన సువిథ సెల్ ను పరిశీలించి , నామినేషన్ల నమూనా ఫారం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ రిజిస్టర్ ను పరిశీలించారు. వివిధ అనుమతుల కోసం వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారం వివరాలు తెలుసుకున్నారు. ఏ ఏ అనుమతులు జారీ చేయడం జరుగుతుంది, అందుకు అనుగుణంగా అక్కడ ఏర్పాటు చేసిన నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం స్వీప్ కార్యక్రమం, ఓటర్ అవేర్నెస్ నేపధ్యంలో తీసుకున్న ఫొటో గ్యాలరీ, సమీకృత కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సి విజిల్, ఎమ్ సి సి, ఎక్సపెండిచర్ సెల్, సువిధ కంట్రోల్ కేంద్రం, జిల్లా స్థాయి ప్రధాన కంట్రోల్ రూం, 1890 425 2540 టోల్ ఫ్రీ, 1950 కాల్ సెంటర్, ఎన్ జి ఎస్పి సెల్, ఫిర్యాదుల పర్యవేక్షణ విభాగం, వెబ్ కాస్టింగ్, జిపిఎస్ ట్రాకింగ్, మీడియా పర్యవేక్షణ విభాగాలను పరిశీలించడం జరిగింది. మీడియాలో ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేసే విధానం, వాటి పరిష్కార తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత వివరాలను తెలియజేస్తూ ప్రచారం కోసం వాహనాల అనుమతులను 48 గంటల్లో ఇస్తున్నట్లు తెలిపారు. సి విజిల్ యాప్, ఎమ్ సి ఎం సి , కంప్లైంట్ పై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. మీడియా లో వచ్చే ప్రతికూల వార్తలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులకు వివరాలు, జిల్లా ఎన్నికల అధికారి, సంబంధిత రిటర్నింగ్ అధికారులకు ఎప్పటి కప్పుడు పంపించి వివరణలు తెలుసుకోవడం, ఆ సమాచారం రాజకీయ పార్టీల కు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కథనాలు, అంశాలపై తీసుకుంటున్న రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా కి సమగ్ర సమాచారం వివరించారు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, మాధ్యమాలలో వచ్చే రాజకీయపరమైన ప్రకటనలు, సంబంధిత అంశాలను పరిశీలించి వాటిని సంబంధిత రిటర్నింగు అధికారులకు పంపడం ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు వివరించారు.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో వస్తున్న ఫిర్యాదుల విషయంలో తీసుకున్న చర్యల వివరాలు ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో అందచేస్తున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీం లు, ఫ్లైయింగ్ సర్వేలెన్స్ టీం లు క్షేత్రస్థాయిలో పరిశీలనకు సంబంధించి ఆయా వాహనాలకు అమర్చిన జి. పి ఎస్. విధానం ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నది, ఆయా నిఘా బృందాల కదలికలను పరిశీలించడం జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నిర్వహణా తీరు, వెబ్ కాస్టింగ్ వివరాలను కలెక్టర్ వివరించారు. ప్రతి రోజు వివిధ నోడల్ అధికారులు నిర్వర్తించే అంశాలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ కు రోజు వారీ నివేదికలు పంపే విభాగాలను , ఆయా రిజిస్టర్ల ను పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లను స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా కు కలెక్టర్ మాధవీలత వివరించారు. ఈ సందర్భంలో ఎస్పి పి .జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, అదనపు ఎస్పీ పి. అనీల్ కుమార్, డి ఆర్వో జీ. నరసింహులు ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు.