వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తో వంగవీటి నరేంద్ర భేటీ
విజయవాడ బ్యూరో ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ గెలుపు ఖాయమని, ఈ మేరకు తాము అన్ని డివిజన్ల లో పర్యటించి ఓటర్లను చైతన్యవంతం చేస్తామని వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, రాష్ట్ర రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు వంగవీటి నరేంద్ర చెప్పారు. గురువారం భవానీపురంలోని ఆకుల శ్రీనివాస్ కుమార్ ఇంటికి వచ్చిన వంగవీటి నరేంద్ర ఆయనతో భేటీ అయ్యారు. పలు విషయాలపై నాయకులు ఇరువురు చర్చించారు. పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఆసిఫ్ ను గెలిపించేందుకు గల అన్ని అంశాలపై వారు క్షుణ్ణంగా చర్చించుకోవడం జరిగింది. సీఎం జగనన్న పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రజల కోసం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వారు నిర్ణయించారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను వైసిపి కి ఓట్లు వేసే విధంగా తగిన కార్యాచరణను రూపొందించు కోవాలని నాయకులు చర్చలు జరపడం జరిగింది . ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అల్లం పూర్ణచంద్రరావు, పొదిలి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.