ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు
23వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి
చంద్రబాబు నుండి బోండా ఉమ వరకు కుటమికి ఓటమి భయం పట్టుకుంది
వాలంటరీలపై చంద్రబాబు ముసల సానుభూతి చూపిస్తున్నారు
వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురందేశ్వరిల ఓటమి ఖాయం
చంద్రబాబు ప్రభుత్వం లోనే కదా వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయింది..చంద్రబాబు అప్పుడు ఏమి చేశాడు
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం నియోజకవర్గంలో స్థానిక 23వ డివిజన్ గవర్నర్ పేట తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరి సుబ్బారావు తదితరులతో కలిసి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 23వ డివిజన్ లో పర్యటించడం జరిగిందన్నారు. చంద్రబాబు నుండి బోండా ఉమ వరకు కుటమికి ఓటమి భయం పట్టిందన్నారు.వాలంటరీ వ్యవస్థను బస్తాలు మోస్తారు.ఇంటికి వెళ్లి తలుపులు కొడతారు మహిళలు మిస్సింగ్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు చంద్రబాబు ముసల సానుభూతి చూపిస్తున్నాడన్నారు. సుంట పుత్రుడు లోకేష్,దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పై నీచంగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్,లోకేష్ లకు సిగ్గు శరం లేద అని ప్రశ్నించారు. దిక్కుమాలిన నిమ్మగడ్డ రమేష్ తో వాలంటరీ వ్యవస్థపై దొంగ కేసులు బనాయించారన్నారు. వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అని అన్నారు. చంద్రబాబు మొన్న 50,000 అని ఈరోజు 10,000 అంటున్నాడన్నారు. చంద్రబాబుకు మతిభ్రమించిందన్నారు. 2014, 19 చంద్రబాబు లోకేష్ కి ఉద్యోగం ఇప్పించాడు అది మంత్రి ఉద్యోగం అని అన్నారు.లోకేష్ కి మంగళగిరిలో మళ్లీ ఓటమి తథ్యం అన్నారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడన్నారు.175 నియోజకవర్గంలో గెలిచేది సీఎం జగన్ అని తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పురందేశ్వరిని ఓడించడం ఖాయం అని అన్నారు.పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడన్నారు.టీడీపీ,జనసేన పార్టీలు ఎన్నికల తర్వాత బిజెపిలో విలీనం చేస్తారన్నారు.శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు కెసిఆర్ తో శవ రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు.చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోలేదా అని అన్నారు.సీఎం జగన్ సొంత సింబల్ తో సింగల్ గా సింహం లాగా వస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే కదా వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిందన్నారు.చంద్రబాబు అప్పుడు ఏమి చేశాడు అని ప్రశ్నించారు.వారి కుటుంబంలో చిచ్చులు పెట్టి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నడన్నారు.హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం జగన్ దుర్మార్గులపై అర్జునుల పోరాటం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు విక్కీ,బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్,చల్లా సుధాకర్,కాపు సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి అంజిబాబు,పసుమర్తి రాజేష్, 23వ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.