అభివృద్ధి, సంక్షేమ పాలనకు మద్దతునివ్వండి
ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి
చిక్కాల వలస సుందరాపురం పంచాయతీల్లో నరసన్నపేట వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం
నరసన్నపేట బ్యూరో ప్రతినిధి : మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ జగనన్న సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం చిక్కాల వలస, సుందరాపురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు దొంగ హామీలతో మీ ముందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని హితువు పలికారు. మీ కుటుంబానికి మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు మద్దతు తెలపాలని కోరారు. ప్యాన్ గుర్తు పై ఓటు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మాన కృష్ణదాస్ ను అలాగే ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను ఆశీర్వదించాలని వీరు కోరారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రజలు నుండి విశేష స్పందన లభించింది. ఈకార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు పిఎసిఎస్ అధ్యక్షులు పోన్నాన దాలినాయుడు పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు అప్పన్న మండల పార్టీ అధ్యక్షులు లుకలాపు రవి కుమార్, ఉపాధ్యక్షుడు బగ్గు రమణయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి బార్ల వేణుగోపాలరావు, మండలం యువజన విభాగం అధ్యక్షుడు పాగోటి గోవిందరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పోట్నూరు సాయిప్రసాద్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బుద్దల రాజశేఖర్, స్థానిక నాయకులు మొయ్యి లక్ష్మునాయుడు, ఎంపీటీసీ పోగోటి గౌతమి భరద్వాజ్, సర్పంచులు ఎంపీటీసీలు, నరసన్నపేట మండల పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.