విజయవాడ బ్యూరో ప్రతినిధి : పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భవానిపురంలో నూతన పార్టీ కార్యాలయాన్ని సుజనాచౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బిజెపి, టిడిపి , జనసేన నేతలు, కార్యకర్తలు హజరయ్యారు. సుజనాచౌదరికి కూటమి నేతలు స్వాగతం పలికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సుజనాచౌదరి పాల్గొన్నారు. వేద పండితులు ఉగాది పంచాంగ పఠనం చేశారు. గురువు మారుతున్నాడని, రాష్ట్రంలో పాలకుడు మారే అవకాశం ఉందని, ప్రజలకు మంచి జరుగుతుందని వేదపండితులు వెల్లడించారు. పంచగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతుందిని, బంగారం ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు.