ఏపీ ఎమ్ పి ఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్
విజయవాడ బ్యూరో ప్రతినిధి:
సీనియర్ జర్నలిస్టు యేమినేని వెంకట రమణ సేవలు నేటి జర్నలిస్టులకు ఆదర్శమని ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ అన్నారు. ఉగాది ఉత్సవాలు సందర్భంగా యేమినేని వెంకట రమణ ను ఏపీఎంపీఏ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ 34 సంవత్సరాలుగా జర్నలిస్టుగా రాణిస్తున్న రమణ ను రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తరుపున, మరోసారి ఈ ఏడాదే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరుపున సన్మానించారని శ్రీరామ్ యాదవ్ గుర్తు చేశారు. అలాగే ఆంద్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్,తెలుగు సంస్కృత సేవ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో “”సామాజిక సేవా సామ్రాట్”” బిరుదుతో సత్కరించటం జరిగింది. అదేవిధంగా రచయిత గా ఓ తెలుగు సాహిత్యం మాసపత్రిక తో కాలమిస్టుగా రచనలు చేస్తూ ఎంతో గుర్తింపు పొందిన రమణ ని ఉగాది పురష్కారం తో సత్కారం చేశామన్నారు. ఏపీఎంపీఏ రాష్ట్ర,నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎంపీఏ రాష్ట్ర, నగర నాయకులు, సురేష్ బాబు, పసుపులేటి చైతన్య, ప్రశాంత్,తాళ్లూరి అనీల్ కుమార్,గుర్రం శ్రీనివాస్,కోట రాజా, నాగోతి శ్రీనివాసరావు (ఎన్ ఎస్ ఆర్), పిల్లా ఆనంద్, మానేపల్లి మల్లి, ఫణికుమార్,కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఏపీఎంపీఏ రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకట రమణ మాట్లాడుతూ తనకు ఇంతటి గౌరవం ఇచ్చి సత్కరించటం పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తన అదృష్టమన్నారు.