పశ్చిమ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాసరావు ఫిర్యాదు
విజయవాడ, ప్రత్యేక ప్రతినిధి : సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరంచిన తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, బిజెపి పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గం సామాన్యుడికి, పేదవాడికి జరుగుతున్న పోరులో వైయస్సార్సీపి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గం లో ఎన్డీఏ కూటమి బిజెపి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి , పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ భవానిపురం ఎన్నికల ప్రచారంలో మహిళలు హారతులు ఇచ్చిన సమయంలో డబ్బులు ఇచ్చిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివారం పశ్చిమ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం , బిజెపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మహిళలు హారతులు ఇచ్చిన సమయంలో డబ్బులు ఇచ్చిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బు సంచులతో పశ్చిమ నియోజక వర్గాన్ని కొనుగోలు చేద్దామని రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.