కనిగిరి : రాష్ట్ర పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు చూసి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపి ని ఆదరించాలని వైసీపి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు . కనిగిరి పట్టణంలో వైసీపి ఆత్మీయ సమావేశం , ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు . ఈ సంధర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజారెడ్డి ,వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు తరాల నుండి 36 ఏళ్ళు వారితో పయనించి వారి మాటే శిరోధార్యంగా పని చేయడం వల్లే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు .జగనన్న తో ఉన్న సాన్నిహిత్యంతో కనిగిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు .నమ్ముకున్న కార్యకర్తల కోసం చేయి పట్టుకొని యెంత దూరమైన నడవాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద నేర్చుకున్నానని తెలిపారు ,తనకు వ్యాపారాలు ,చెడు వ్యసనాలు లేవని మిలో ఒకడిగా ఉంటూ కార్యకర్త లాగా కలిసి పని చేస్తానని చెప్పారు .కార్యకర్తలే పార్టీకి బలమని ప్రజలను కుటుంబాన్ని వేరులా చూసే వారు నాయకుడు కాదన్నారు .కదిరి బాబురావు కు ఎమ్యెల్సీ అవకాశం ఇస్తానని సీఎం జగనన్న హామీ ఇచ్చినట్లు తెలిపారు .ఎమ్యెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ బీసి సామజిక వర్గం నుండి తనకు టిక్కెట్టు కేటాయించారని తనను ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు .సామాన్య కార్యకర్త లాగా సేవ చేస్తానని చెప్పారు .మాజీ ఎమ్యెల్యే కదిరి బాబురావు మాట్లాడుతూ చంద్రబాబు మోసగాడని నమ్మవద్దని తెలిపారు .ఎంపీ అభ్యర్థి దొల్లుడు పుచ్చకాయ లాగా పార్టీలు మారుతారని ఎంపీగా కనిగిరి లో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు .కేసులు కోసం బీజేపీలో చేరాలని చూశాడని అక్కడ ఎంట్రీ లేక టిడిపిలో చేరాడని చెప్పారు .ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి కృషి చేయాలనీ ,పీసీపల్లి మండలాన్ని వెలిగొండ ప్రాజెక్టు లో చేర్చాలని ,కనిగిరి ప్రనటంలో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి ని కోరారు .ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్యెల్యే టీజె సుధాకర్ బాబు ,రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ,పిడిసిసి బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి ,ఏఎంసీ చైర్మన్ సాల్మన్ రాజు ,ఎంపీపీ డి ప్రకాశం ,జడ్పిటిసి ఎమ్ కస్తూరిరెడ్డి ,వైస్ చైర్మన్ పులి శాంతి ,మూలే మాలకొండారెడ్డి ,తమ్మనేని సుజాత తదితరులు ఉన్నారు.