సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి
ఎంట్రన్స్ కోచింగ్ కోసం ఏప్రిల్ 8నుండి కొత్త బ్యాచ్
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27న యధావిధిగా ప్రవేశ పరీక్ష
విజయవాడ బ్యూరో ప్రతినిధి : పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ధరఖాస్తు గడువును ఏప్రిల్ పదవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ , సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారంతో ధరఖాస్తు గడువు ముగిసినప్పటికీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నుండి అందుతున్న వినతుల మేరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్ అప్లికేషన్లకు మరో ఐదు రోజలు గడువును పొడిగిస్తున్నామన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27వ తేదీన యధావిధిగా జరుగుతుందన్నారు. పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం విధ్యార్ధులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను ఉత్సాహభరిత వాతావరణంలో జరగుతున్నాయని కమీషనర్ వివరించారు. పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా విద్యార్ధులకు ఇస్తున్న సమగ్ర శిక్షణకు మంచి స్పందన లభిస్తుందన్నారు. పలు ఎంట్రన్స్ కోచింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి విధ్యార్ధులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేయటమే కాక, పాలిటెక్నిక్ తదుపరి అందివచ్చే ఉపాధి అవకాశాలను గురించి తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఈ శిక్షణకు మంచి డిమాండ్ ఉందని, విద్యార్దులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఎనిమిదవ తేదీ నుండి మరో బ్యాచ్ ప్రారంభించేందుకు సాంకేతిక విద్యా శాఖ సన్నాహాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని 87 ప్రభుత్వ, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్లలో ఏప్రిల్ 24 వరకు తరగతులు నిర్వహించి ఏప్రిల్ 25వ తేదీన గ్రాండ్ ఫ్రీ ఫైనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను సైతం నిర్వహిస్తామని నాగరాణి వివరించారు. తెలుగు, ఇంగ్లీషు మాధ్యమ విధ్యార్దులకు ఉపకరించేలా రెండు భాషలలోనూ స్టడీ మెటీరియల్ ను విద్యార్దులకు అందిస్తామన్నారు. శిక్షణలో రెండు గంటల పాటు గణితం, ఒక గంట భౌతిక శాస్త్రం, మరో గంట రసాయన శాస్త్రం బోధిస్తారన్నారు. పొడిగించిన దరఖాస్తు గడువును విద్యార్దులు సద్వినియోగం చేసుకుని అన్ లైన ధరఖాస్తును పూర్తి చేయాలని, విధ్యార్లులకు ధరఖాస్తు విధానంలో సహాయం చేసేందుకు అన్ని ప్రభుత్వ పాలిటెక్నక్ లోనూ ఉచిత సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ , సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు.