ఉపముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజద్ భాష, నగర మేయర్ కే సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ వినోద్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి
కడప : బాబు జగ్జీవన్ రామ్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజద్ భాష, నగర మేయర్ కే.సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామ చంద్రారెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. స్థానిక కొత్త కలెక్టరేట్ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజద్ భాష, నగర మేయర్ కే.సురేష్ బాబు ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజద్ భాష మాట్లాడుతూ ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా కడప నగరంలో కూడా ప్రతిఒక్కరు బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ మహోన్నత వ్యక్తి అని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. బాబు జగ్జీవన్ రామ్ ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించి దేశానికే ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు. అదేవిధంగా కార్మిక, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగిందని అన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే భారతీయులు ఉన్నారో వారందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు. రాబోవు రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన రైతుల కోసం అయితే నేమి, కార్మికుల కోసమైతేనేమి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, ఆ సంస్కరణలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి ఒక్కరూ సాయి శక్తుల కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని చెప్పారు. మరోసారి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలను తెలియజేస్తున్నానని చెప్పారు.
నగర మేయర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో, దేశంలోని వాడ వాడల ఆయన జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వ్యక్తులు కొల్లలు కొల్లలుగా ఉన్నారని అన్నారు. ఆయన భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తే కాకుండా కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి అని అన్నారు. ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలను తీసుకొని వచ్చి భారతదేశంలోనే గిడ్డంగుల సంస్కృతిని తీసుకొని వచ్చారని అన్నారు. దేశంలోని జిల్లాల వారీగా వాడ వాడలలో గిడ్డంగులను సంస్కరణను తీసుకొని వచ్చి ఆ రోజుల్లో రైతు సోదరులను ఆదుకున్న మహోన్నత వ్యక్తి అని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితే నేమి ఆయన తండ్రి అయిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లను ఆదర్శంగా తీసుకున్నారని కొన్ని లక్షల మంది పేదవారికి, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ఇంటి పట్టాలు అయితే నేమి, వ్యవసాయ భూములయితేనేమి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 5 లక్షల 94 వేల మందికి భూములు దున్నుకునేందుకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, తన తనయుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 31 లక్షల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణం చేయడం జరుగుతోందని ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వం లో బాబు జగ్జీవన్ రామ్, బి ఆర్ అంబేద్కర్ లను ఆదర్శంగా తీసుకొని ఆదర్శంగా పనిచేస్తామని, భవిష్యత్ తరాల వారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి జయంతిని ఎవరు మర్చిపోకూడదని ఈ జయంతులను పండగ వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. తొలుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజద్ భాష, నగర మేయర్ కే.సురేష్ బాబు లు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు నడిపించడం జరిగింది, మరియు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నారపురెడ్డి సుబ్బారెడ్డి,సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి,మార్కెట్ యార్డు చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు వినోద్ కుమార్, నగర అధ్యక్షుడు కంచుపార్టీ బాబు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయక్, జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు శివ నాయక్,వైయస్సార్ టియుసి నగర అధ్యక్షుడు నాగరాజు,కార్పొరేటర్లు శ్రీరంజన్ రెడ్డి బాలకృష్ణారెడ్డి, లక్ష్మయ్య,బండి ప్రసాద్, కే.బాబు, రామలక్ష్మణ్ రెడ్డి, నాయకులు సమర్నాథరెడ్డి, మునిశేఖర్ రెడ్డి , మాస్టర్ అహ్మద్, మధు, సంపత్ , అర్జున్, సాయి దత్త , మనోజ్ కుమార్, లక్ష్మీనారాయణ, మహిళ నాయకురాలు టిపి.సుబ్బమ్మ,కృష్ణవేణి,రత్నకుమారి, ప్రియులు తులసమ్మ , పద్మ ,ఉమామహేశ్వరి,చైతన్య, సునీత రెడ్డి, విజయ కుమారి,ఎస్సీ, ఎస్ టి, బీసీ కుల సంఘాల నాయకులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.