నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..
బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టీ రామారావు ప్రారంభించారు..
తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి..
దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన ఈ వార్తలు బులిటెన్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఒక సంచలనం..
వాటిని లైవ్ లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్, ఇక లేరు..
జీవన, సాహిత్య సారాన్ని అవపోసన పట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు. 2011లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు..
తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది శాంతి స్వరూప్..
పేరుకు తగ్గట్టుగా మాటల్లో చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే..
వార్తలు సమాచారం జాబులు, జవాబులు, ధర్మ సందేహాలు కార్యక్రమం.. ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర’శాంతం’గా చొచ్చుకుపోయేలా చేశారు..