64వ డివిజన్ లోఓట్లు అభ్యర్థించిన వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం నియోజక వర్గంలో స్థానిక 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాములు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు.ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 64వ డివిజన్ లో పర్యటించడం జరిగిందన్నారు. అందరితో కలిసి పర్యటించాం అన్నారు.ప్రతి ఒక్కరు ఫ్యాన్ కి ఓటు వేస్తాం అని చెప్తున్నారన్నారు. ఈ డివిజన్ వైస్సార్సీపీ అడ్డా అని తెలిపారు. ఈ డివిజన్ అభివృద్ధి చేసింది వైస్సార్సీపీ అని తెలిపారు. కొంత మంచినీటి సమస్య ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది దానిని పరిష్కరించేందుకు కృషి చేస్తాం అని హామీ ఇచ్చాం అన్నారు. మాకు అన్ని సంక్షేమ పధకాలు అందుతున్నాయని ప్రజలు తెలిపారన్నారు.అవ్వా తాతలు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. పింఛన్ ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పింఛన్ ఆపడానికి కారణం అయ్యానే మళ్ళీ పింఛన్ మళ్ళీ ఇంట ఇంటికి ఇవ్వండని కోరుతున్నాడు. ఈ విధానం సబబు కాదన్నారు. అవ్వ తాతల ఉసురు చంద్రబాబు తగలక తప్పదన్నారు.పింఛన్ తీసుకునే లబ్ధిదారులు తగిన రీతిలో బుద్ది చెపుతారన్నారు. బోండా ఉమా అనే వ్యక్తి బుద్ది ఉందా అని ప్రశ్నించారు.డ్రామాలకి నాటకాలకు తాగుబోతులకు కేరాఫ్ అడ్రెస్ బోండా ఉమా అని దుయ్యాబట్టారు.తాగిన మైకంలో ఏది పడితే మాట్లాడద్దు అని హితువు పలికారు. బోండా ఉమా ఒక గజినీ అని పేర్కొన్నారు.వాలెంటీర్స్ లేకపోతే ఇంటి ఇంటికి పింఛన్ ఏ రకంగా ఇవ్వగలరు.బోండా ఉమాకి చిప్పు పోయిందన్నారు.బోండా ఉమాకి మందు బాగా దాగి మైండు పోయిందన్నారు.
ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.